LOADING...
Iran: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ తర్వాత.. తన గగనతలాన్ని పాక్షికంగా తెరిచిన ఇరాన్  
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ తర్వాత.. తన గగనతలాన్ని పాక్షికంగా తెరిచిన ఇరాన్

Iran: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ తర్వాత.. తన గగనతలాన్ని పాక్షికంగా తెరిచిన ఇరాన్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తరుణంలో, ఇరాన్‌ తూర్పు ప్రాంతాల్లో తన గగనతలాన్ని (ఎయిర్‌స్పేస్‌) మళ్లీ తెరిచింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య దాదాపు 12 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు తగ్గిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 13న ఇజ్రాయెల్‌ భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడగా, దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తన గగనతలాన్ని మూసివేసినప్పటికీ, ఆ క్రమంలోనే ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు కూడా ప్రారంభించింది. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా జోక్యం చేసుకోవడంతో, జూన్‌ 25 మంగళవారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కార్యరూపం దాల్చింది.

వివరాలు 

అధికారిక నోటీసులు వెలువడే వరకు ఈ నిషేధం

ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ ఇచ్చిన సమాచారం ప్రకారం, రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మాజిద్ అఖావన్ తూర్పు ఇరాన్‌లో అంతర్జాతీయ, దేశీయ విమానాల కోసం గగనతలాన్ని తిరిగి తెరిచినట్లు తెలిపారు. అయితే ఈ నిర్ణయం కేవలం తూర్పు ప్రాంతాల్లోని కొన్ని విమానాశ్రయాలకే పరిమితమైందని స్పష్టం చేశారు. మషద్‌ విమానాశ్రయం.. గతంలో ఇజ్రాయెల్‌ దాడులకు లక్ష్యంగా మారిన మషద్‌ విమానాశ్రయం..మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే చాబహార్‌,జహెదాన్‌, జాస్క్‌ వంటి విమానాశ్రయాలు కూడా తిరిగి సేవలందించనున్నట్లు వెల్లడించారు. కానీ, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా దేశంలోని ఇతర ప్రాంతాల విమానాశ్రయాలకు గగనతలాన్ని ఇంకా అనుమతించలేదని స్పష్టం చేశారు. తదుపరి అధికారిక నోటీసులు వెలువడే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అన్నారు.