
Iran-US: దిగొచ్చిన ఇరాన్.. అణు ఒప్పందం కోసం అమెరికాతో చర్చలకు రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఎట్టకేలకు అమెరికాతో అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ముందడుగు వేసింది.
న్యాయమైన అణు ఒప్పందం కోసం అమెరికాతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సమీపంగా ఉన్న అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇందులో భాగంగా చర్చల నిమిత్తం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిని ఒమన్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు.
చర్చలు సానుకూలంగా సాగితే, అమెరికాతో అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
Details
ఉద్రిక్తతల నడుమ చర్చలకు శ్రీకారం
అంతర్జాతీయ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం, అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధుల బృందం, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నేతృత్వంలోని బృందంతో అణు చర్చలు జరపనుంది.
గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అణు ఒప్పందం కుదరకపోతే తీవ్రమైన బాంబు దాడులు జరుగుతాయని హెచ్చరించడంతో, ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రతిగా ఇరాన్ కూడా తాము తగిన విధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
ఈ రకమైన ఉద్రిక్త వాతావరణంలో ప్రస్తుతం చర్చలకు మార్గం సుగమం కావడం విశేషం.