LOADING...
Enriched Uranium: ఇరాన్ 11 టన్నుల యురేనియం ఎక్కడ..? అమెరికా దాడుల తర్వాత పెరిగిన సస్పెన్స్
ఇరాన్ 11 టన్నుల యురేనియం ఎక్కడ..? అమెరికా దాడుల తర్వాత పెరిగిన సస్పెన్స్

Enriched Uranium: ఇరాన్ 11 టన్నుల యురేనియం ఎక్కడ..? అమెరికా దాడుల తర్వాత పెరిగిన సస్పెన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వైమానిక దాడుల తర్వాత ఇరాన్‌కు చెందిన సుమారు 11 టన్నుల ఎన్‌రిచ్డ్ యురేనియం ఎక్కడుందన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఎనిమిదేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందం నుంచి తప్పుకున్న తర్వాత, ఇరాన్ భారీగా యురేనియం నిల్వలు పెంచుకుంది. తక్కువ స్థాయిలో ఉంటే ఇది విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుందిగానీ, అధిక స్థాయిలో ఎన్‌రిచ్ చేస్తే అణు బాంబులకు వాడే సామర్థ్యం వస్తుంది. ముఖ్యంగా 20 శాతం దాటిన తర్వాత ఎన్‌రిచ్ చేయడం వేగంగా సాగుతుండటం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. 2006 నుంచే ఇరాన్ పారిశ్రామిక స్థాయిలో యురేనియం ఎన్‌రిచ్ చేస్తూ వస్తోంది.

వివరాలు 

మళ్లీ ఎన్‌రిచ్ స్థాయిలను పెంచి 60 శాతం వరకు తీసుకెళ్లిన ఇరాన్

2015లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో జరిగిన అణు ఒప్పందంతో ఎన్‌రిచ్ పరిమితులు విధించగా, 2018లో ట్రంప్ బయటకు రావడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత ఇరాన్ మళ్లీ ఎన్‌రిచ్ స్థాయిలను పెంచుతూ 60 శాతం వరకు తీసుకెళ్లింది. 2025లో ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. 12 రోజుల యుద్ధ సమయంలో అమెరికా, నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఆ తర్వాత ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో సహకారం నిలిపివేయడంతో, పర్యవేక్షణ పూర్తిగా తగ్గిపోయింది.

వివరాలు 

యురేనియం అణు ఆయుధంగా మార్చడానికి నెలలు, కొన్నిసార్లు ఏడాది సమయం కూడా పట్టచ్చు 

ప్రస్తుతం ఆ 11 టన్నుల యురేనియం ఎక్కడుందన్నది స్పష్టత లేకుండా ఉంది. కొంత భాగం భూగర్భంలో దాచిపెట్టినట్టు, మరికొంత భాగం దాడుల్లో శిథిలాల కింద ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తిరిగి ఉపయోగించాలంటే అణు ఆయుధంగా మార్చడానికి నెలలు, కొన్నిసార్లు ఏడాది కూడా పట్టొచ్చని అంచనా. అమెరికా మాత్రం శాటిలైట్లతో ఈ నిల్వలపై నిఘా ఉంచుతున్నామని చెబుతోంది. అయితే కొందరు విశ్లేషకులు ఇస్ఫహాన్ పర్వతాల్లో రహస్య ఎన్‌రిచ్ కేంద్రాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా అయితే, ప్రపంచానికి తెలియకుండా ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisement