Iran: దాడులకు దాడులతోనే సమాధానం.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) కేంద్రంగా అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ఒకరిపై ఒకరు ప్రతీకార దాడుల హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు, ఇరాన్ కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించింది. ప్రాంతంలోని బ్రిడ్జిలు, విద్యుత్ కేంద్రాలు, అమెరికాకు ప్రయోజనం కల్పించే చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ చేసిన ట్వీట్
Our defense doctrine is clear: eye for an eye.
— Seyed Abbas Araghchi (@araghchi) July 22, 2026
Any aggression against Iran, including our infrastructure, will compel a powerful and decisive response.
Those who contribute to such aggression, whatever the kind of support, will also be considered as legitimate targets.
వివరాలు
పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడితే, ప్రతిసారి ఇరాన్‌లోని ఒక వారధి లేదా విద్యుత్ ప్లాంట్‌ను బాంబులతో ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తమ దేశంలోని ఏ ఒక్క బ్రిడ్జి లేదా పవర్ ప్లాంట్‌పై దాడి చేసినా,ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలతో పాటు అమెరికాకు ప్రయోజనం చేకూర్చే చమురు కేంద్రాలను సమూలంగా ధ్వంసం చేస్తామని ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
వివరాలు
కొనసాగుతున్న గగనతల దాడులు
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ కూడా స్పందిస్తూ, తమ దేశం"కంటికి కన్ను" విధానాన్నే అనుసరిస్తుందని తెలిపారు.దేశ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా,అదే స్థాయిలో తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు.
మరోవైపు సైనిక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌకలపై ఇరాన్ నుంచి వస్తున్న బెదిరింపులను అణచివేయాలనే లక్ష్యంతో అమెరికా మిలిటరీ వరుసగా 12వరోజూ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
పశ్చిమ ఇరాన్‌లోని అహ్వాజ్,రామ్‌షీర్,అండిమేష్క్ సమీప ప్రాంతాలపై అమెరికా క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
షాలంచె సరిహద్దు వద్ద జరిగిన క్షిపణి దాడిలో మృతుల సంఖ్య మూడుకు చేరినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
ప్రభావితప్రాంతాల్లో ఖుజెస్తాన్ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అడ్డుకట్ట
ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధిపై తమకే పూర్తి సార్వభౌమాధికారం ఉందని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ జలసంధి గుండా ప్రయాణించేందుకు ప్రయత్నించిన మూడు చమురు ట్యాంకర్లను అడ్డుకున్నట్లు తెలిపింది.
ఆ ట్యాంకర్లలో ఒకటి పేలుడుకు గురై అగ్నిప్రమాదం సంభవించగా, మిగిలిన రెండు నౌకలు వెనుదిరిగినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఈ పరిణామాలతో హోర్ముజ్ జలసంధి చుట్టూ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారగా, ప్రపంచ చమురు సరఫరాపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
CENTCOM చేసిన ట్వీట్
At 5:30 p.m. ET today, U.S. forces began launching more strikes against Iranian military targets at the Commander in Chief's direction. The mission will continue to further degrade Iran's ability to threaten civilian mariners and commercial vessels transiting regional waters.
— U.S. Central Command (@CENTCOM) July 22, 2026