LOADING...
Iran: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్,సహా పలువురు కీలక వ్యక్తులు మృతి
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్,సహా పలువురు కీలక వ్యక్తులు మృతి

Iran: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్,సహా పలువురు కీలక వ్యక్తులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తతలకు అడ్డాగా మారుతోంది. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ తిరిగి ఘర్షణాత్మక దిశలో అడుగులు వేస్తోంది. తాజాగా, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ భీకర దాడులు ప్రారంభించింది. ఈ దాడుల వల్ల ఇరాన్‌ పారామిలిటరీ విభాగమైన రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన చీఫ్‌ సహా పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

వివరాలు 

ఐఆర్‌జీసీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ మృతి

ఇజ్రాయెల్‌ నిర్వహించిన ఈ దాడులు ఐఆర్‌జీసీ (ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌) ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్‌ చేసినట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో ఐఆర్‌జీసీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ మృతిచెందినట్టు కథనాలు పేర్కొంటున్నాయి. ఆయనతో పాటు గార్డ్‌లోని మరికొంతమంది ఉన్నతాధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ మృతి