LOADING...
Iran:140 డాలర్ల దిశగా చమురు ధరలు ?.. అమెరికాపై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
140 డాలర్ల దిశగా చమురు ధరలు ?.. అమెరికాపై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

Iran:140 డాలర్ల దిశగా చమురు ధరలు ?.. అమెరికాపై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విధానాలపై ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్(Mohammad Bagher Ghalibaf)మాట్లాడుతూ.. అమెరికా ఆర్థిక ఒత్తిడి వ్యూహాల వల్లే ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారు. యూఎస్ అధికారులు ఇచ్చిన తప్పు సలహాల వల్లే చమురు ధరలు ఇప్పటికే 120 డాలర్లను దాటాయని, త్వరలోనే 140 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

వివరాలు 

గ్లోబల్ మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం

ఇదిలా ఉంటే, డొనాల్డ్ ట్రంప్(Donald Trump)సూచనలతో అమెరికా, హార్ముజ్ జలసంధి(Strait of Hormuz)వద్ద ఇరాన్‌పై ఆంక్షలు అమలు చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ చర్యల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో చమురు సరఫరా తగ్గి, బ్రెంట్ క్రూడ్ ధరలు 118 డాలర్లకు చేరాయి. అయితే, ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ ఆయిల్ వెల్స్ పేలిపోతాయని చెప్పినా ఇప్పటివరకు అలాంటి పరిణామం ఏదీ జరగలేదని గాలిబాఫ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్లోబల్ మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ చేసిన ట్వీట్ 

Advertisement