Iran War: పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం.. వార్నింగ్ ఇచ్చిన గంటలోనే 'అబ్రహాం లింకన్'పై ఇరాన్ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో ఘర్షణలు అనూహ్య మార్గంలో విస్తరించాయి. అమెరికా నౌకా యూనిట్ యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు దాడి చేసింది. ఈ నౌక కదలికలను నిరంతరం గమనిస్తూ, దాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ ముందే హెచ్చరించగా, గంటల్లోనే దాడి జరగడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా కూడా రిలీజ్ చేసింది. వివాదానికి ముగింపు కోసం, అమెరికా ఇరాన్‌తో ముమ్మరంగా చర్చలు కొనసాగిస్తోంది. చర్చల్లో భాగంగా, ఒక నెల పాటు కాల్పుల విరమణ కోసం 15 పాయింట్ల ప్రణాళిక ఇరాన్‌కు పాకిస్థాన్ ద్వారా అందించబడింది. ఇలాంటి సందర్భంలో తాజాగా దాడి జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాలు
వార్నింగ్ ఇచ్చిన గంటలోపే దాడి
ఇరాన్ మళ్లీ అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ప్రకటించడం ఇదేం మొదటిసారి కాదు. ఇటీవల కూడా, తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ధ్వంసం చేసినట్లు, దాంతో అది పని చేయడం ఆపేసిందని, గల్ఫ్ సముద్రంలోనుంచి వెనక్కి వెళ్ళిందని పేర్కొంది. ఆ ప్రకటనపై అప్పట్లో అమెరికా కచ్చితంగా అభిప్రాయం చెప్పి దాన్ని తప్పుడు వార్తగా తోసిపుచ్చింది. మరోవైపు ఇరాన్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇంధనం సమకూరకపోవడంతో అనేక చోట్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం విరమించాలని, శాంతి చర్చలు జరపాలని ప్రపంచ దేశాలు అమెరికా, ఇరాన్‌ను కోరుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
🔴 موشکهای کروز ساحل به دریای ارتش، ناو هواپیمابر آبراهام لینکلن را هدف گرفت
— خبرگزاری فارس (@FarsNews_Agency) March 25, 2026
🔹روابط عمومی ارتش از شلیک موشکهای کروز ساحل به دریا به سمت ناو هواپیمابر آبراهام لینکلن و هدف قراردادن این ناو خبر داد. pic.twitter.com/pCtmnNwFCE