LOADING...
Mojtaba Khamenei: హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుంది.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమెనీ హెచ్చరిక
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమెనీ హెచ్చరిక

Mojtaba Khamenei: హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుంది.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమెనీ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
07:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్ దేశాలతో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల మధ్య ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei)తొలిసారి స్పందించారు. శత్రు దేశాలపై ఒత్తిడి పెంచేందుకు హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. అదే సమయంలో,గల్ఫ్ ప్రాంతంలోని పొరుగు దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఆ స్థావరాలను తక్షణమే మూసివేయాలని కూడా స్పష్టం చేశారు.మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి సహా పలు ఘటనలకు ప్రతీకారం తీర్చుకుంటామని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. ఈ విషయాలను వెల్లడిస్తూ సుప్రీం లీడర్ ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఇక యుద్ధం ప్రారంభమైన సమయంలో మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గల్ఫ్‌లోని అమెరికా బేస్‌లు మూసేయాలి.. లేదంటే దాడులు కొనసాగుతాయి: ఇరాన్ సుప్రీం లీడర్

Advertisement