Ayatollah Ali Khamenei: హత్యజరిగిన ప్రదేశానికి.. ఖమేనీ భౌతికకాయం.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు పలువురు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆయన భౌతికకాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు తరలించారు. అనంతరం ఫిబ్రవరి 28న ఆయన హత్యకు గురైన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన అమరత్వం పొందిన ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. టెహ్రాన్‌లో జులై 4, 5 తేదీల్లో జరగనున్న అంతిమయాత్రకు రికార్డు స్థాయిలో సుమారు రెండుకోట్ల మంది హాజరవుతారని ఐఆర్‌జీసీ అంచనా వేస్తోంది. అధికారిక ప్రకటనకు ముందే నిర్వహించిన ఈ యాత్రలోనే భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
వివరాలు
తొమ్మిదో తేదీ వరకు ఇరాన్‌లోని వివిధ ప్రాంతాల్లో అంతిమయాత్ర
ఖమేనీ మద్దతుదారులు నలుపు రంగు దుస్తులు ధరించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. తొమ్మిదో తేదీ వరకు ఇరాన్‌లోని వివిధ ప్రాంతాల్లో అంతిమయాత్ర కొనసాగనుంది. అనంతరం ఖమేనీ స్వస్థలమైన మషాద్‌లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించి ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ ప్రభుత్వం ఆహ్వానం పంపినట్లు సమాచారం. భారతదేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌కు.. తొమ్మిదో తేదీన మషాద్‌లో ఖననం
In an unannounced event, the coffin carrying the body of the martyred leader Ayatollah Khamenei was brought to the site of his martyrdom.#Revenge pic.twitter.com/ejWhaZ2Y1m
— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) July 2, 2026