LOADING...
Iran: అమెరికా నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు
అమెరికా నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Iran: అమెరికా నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధి దగ్గర మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకోవడంతో, ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది. ఒమాన్ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎంత నష్టం జరిగింది అన్నది స్పష్టత లేదు. మరోవైపు 'టౌస్కా'అనే ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేసి,అది నావల్ బ్లాకేడ్‌ను ఉల్లంఘించిందని ఆరోపించింది.

వివరాలు 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్.. అమెరికా చర్యలను "ఆర్మ్డ్ పైరసీ"గా అభివర్ణించింది. తాము త్వరలోనే బలమైన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి, కాల్పుల విరమణ ఒప్పందం కూడా ప్రమాదంలో పడింది. చర్చలపై కూడా అనిశ్చితి నెలకొంది.

Advertisement