Loading...
Iran Hits Back at US Sanctions: అమెరికా ఆంక్షలకు ఇరాన్ కౌంటర్.. 'మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది'
అమెరికా ఆంక్షలకు ఇరాన్ కౌంటర్.. 'మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది'

Iran Hits Back at US Sanctions: అమెరికా ఆంక్షలకు ఇరాన్ కౌంటర్.. 'మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది'

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై కొంతకాలంగా సైనిక దాడులు కొనసాగించిన అమెరికా.. ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా ఇరాన్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలను తెంచేయడమే లక్ష్యంగా కొత్త ఆంక్షలను ప్రకటించింది. టెహ్రాన్‌తో సంబంధాలు కొనసాగిస్తూ, నగదు అక్రమ చలామణికి సహకరించే దేశాలను డాలర్ వ్యవస్థకు దూరం చేస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. అయితే అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అవసరమైతే ప్రతీకార చర్యలకు దిగుతామని హెచ్చరించింది.

వివరాలు 

ఇరాన్ ధీమా

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి కాదు.

అయితే తాజా ఆంక్షల ఉద్దేశం మాత్రం ఇరాన్‌కు ప్రపంచ దేశాలతో ఉన్న ఆర్థిక సంబంధాలను పూర్తిగా బలహీనపరచడమేనని స్కాట్ బెసెంట్ వెల్లడించారు.

ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు,నగదు అక్రమ చలామణికి సహకరించే సంస్థలు, వ్యక్తులపై కూడా ఒత్తిడి పెంచుతామని అమెరికా స్పష్టం చేసింది.

అయితే అమెరికా నుంచి ఎదురయ్యే ఒత్తిడికి తమ వాణిజ్య భాగస్వాములు తలొగ్గబోరని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది.

ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇరాన్‌కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను తెంచే స్థితిలో అమెరికా లేదని అన్నారు.

అమెరికా చేస్తున్న ప్రకటనలను ఎవరూ విశ్వసించడం లేదని పేర్కొన్నారు.

వివరాలు 

వాషింగ్టన్‌కు మరో ఓటమి తప్పదు: అలీ మదానీజాదేహ్

తమపై విధించిన ఆంక్షలను పరిగణనలోకి తీసుకోబోమని పలువురు వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే ఇరాన్‌కు సందేశాలు పంపినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదేహ్ కూడా అమెరికా ఆంక్షలపై ఘాటుగా స్పందించారు.

వాషింగ్టన్‌కు మరో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

కొత్తగా విధించిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ వద్ద రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలిపారు.

ఇరాన్ ప్రజల సంకల్పాన్ని, దేశ అధికారుల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికా చేయగలిగిన ప్రయత్నాలన్నీ ఇప్పటికే చేసిందని అన్నారు.

అయినప్పటికీ ప్రతిసారీ అమెరికా విఫలమైందని మదానీజాదేహ్ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా చర్యలకు అవసరమైతే ప్రతీకార చర్యలు

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతూ అమెరికా ముందుకు వెళ్తుండగా.. తమ వాణిజ్య భాగస్వాముల మద్దతుతో ఆంక్షలను ఎదుర్కొంటామని టెహ్రాన్ స్పష్టం చేసింది.

అదే సమయంలో అమెరికా చర్యలకు అవసరమైతే ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ద్వారా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT