Page Loader
Iran: ఇజ్రాయెల్ దాడిపై యూఎస్ ను అప్రమత్తం చేసిన ఇరాన్ 
ఇజ్రాయెల్ దాడిపై యూఎస్ ను అప్రమత్తం చేసిన ఇరాన్

Iran: ఇజ్రాయెల్ దాడిపై యూఎస్ ను అప్రమత్తం చేసిన ఇరాన్ 

వ్రాసిన వారు Stalin
Apr 06, 2024
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియాలోని కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని, ఆ దేశం యుద్ధానికి సన్నద్ధంగా ఉందని ఇరాన్ అమెరికాకు వెల్లడించింది. మధ్యప్రాశ్చ్యం( Middle East) లో చెలరేగుతున్న హింస నేపథ్యంలో ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇరాన్ దేశం అమెరికాకు వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ వలలో అమెరికా పడలేదని పేర్కొంటూ ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల డిప్యూటీ జమ్ షిది ఈ మేరకు వాషింగ్టన్ కు లేఖ రాశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ను ఉద్దేశించి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ ఆయన పోస్ట్ చేశారు.

Details

ఇరాన్ లేఖపై స్పందించని అమెరికా

దీనికి స్పందనగా అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయబోదని జమ్ షిది తెలిపారు. అయితే ఇరాన్ పంపిన లేఖపై మీద అమెరికా ఇంతవరకూ స్పందించలేదు. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే అవకాశముందని ఇందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండాలని అమెరికా అప్రమత్తం చేసినట్లు సీ ఎన్ ఎన్ ఓ కథనంలో పేర్కొంది.