Donald Trump: నవంబరు తర్వాత ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసిపోవచ్చు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తనను, రిపబ్లికన్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధాన్ని సాగదీస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో నవంబరులో జరగనున్న కీలక మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసిపోయే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు చాలా వేగంగా తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ''9/11 నాటి అల్‌ఖైదాతో మొదలెడితే.. ఇప్పుడు ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న నంబర్ వన్ దేశంగా ఉన్న ఇరాన్‌తోనూ పోరాడుతున్నాం. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకుండా మా సైనికులు కృషి చేస్తున్నారు.
వివరాలు
అమెరికానే అల్‌ఖైదాను పెంచిపోషించింది: ఇరాన్
మేం గెలిచేందుకే పోరాడుతున్నాం. మాకు మరో అవకాశం లేదు. అందుకే నేటికీ మేం యుద్ధం చేస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌పై సైనిక చర్యలను సమర్థించుకునేందుకు అమెరికా 9/11 ఘటనను ఉపయోగించుకుంటోందని విమర్శించింది.
9/11 దాడుల వెనుక ఉన్నవారు ఇరానీయులు కాదని స్పష్టం చేసింది.
అదే సమయంలో.. నాడు దాడులకు పాల్పడిన అల్‌ఖైదా ఉగ్రవాదులను అమెరికానే ఆయుధాలు, వ్యవస్థాపక సహకారంతో పెంచి పోషించిందని ఇరాన్ ఆరోపించింది.