IRAN WARNING : ఇజ్రాయెల్ దాడులను ఆపకుంటే, పరిస్థితి వేరేలా ఉంటుందని ఇరాన్ హెచ్చరికలు
ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే గాజా బాంబు దాడులను నిలిపేయాలని అల్టిమేటం ఇచ్చింది. ఇదే రీతిలో గాజాపై యుద్ధం కొనసాగిస్తే ఫలితం వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. గాజాపై దాడులు కొనసాగిస్తే, ఇజ్రాయెల్ పై ఇతర మార్గాల్లో ముకుమ్మడిగా దాడులు జరుగుతాయని ఇరాన్ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ కనికరం లేని బాంబు దాడులను చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ అన్నారు. గురువారం తెల్లవారుజామున, అమిరాబ్ డొల్లాహియాన్ ఇరాక్‌లో ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీతో సమావేశమయ్యారు.అనంతరం ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తూ ప్రకటనలు చేశారు. సాయంత్రం అమిరాబ్ బీరూట్‌కు చేరుకున్నాక హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ప్రతినిధులు స్వాగతం పలకడం గమవార్హం.