LOADING...
Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు 'బిగ్ సర్‌ప్రైజ్' ఇస్తాం.. ఇరాన్ హెచ్చరిక
అమెరికా, ఇజ్రాయెల్‌కు 'బిగ్ సర్‌ప్రైజ్' ఇస్తాం.. ఇరాన్ హెచ్చరిక

Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు 'బిగ్ సర్‌ప్రైజ్' ఇస్తాం.. ఇరాన్ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి యూఎస్, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. త్వరలోనే 'బిగ్ సర్‌ప్రైజ్' ఇవ్వబోతున్నామని ఇరాన్‌కు చెందిన ఓ భద్రతాధికారి పేర్కొనడం గమనార్హం. ఇరాన్‌ తన స్వంత వ్యూహాలు, ముందే నిర్ణయించుకున్న లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు తాము అనూహ్య ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అమెరికా రూపొందించిన లక్ష్యాల జాబితా లోపభూయిష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని చేస్తున్న హెచ్చరికలను ఇరాన్ తేలికగా తీసుకుంది.

వివరాలు

ట్రంప్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి

అలాంటి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించింది. అలాగే అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిన ఘటనను ప్రస్తావిస్తూ, వారి సైనిక చర్యలు విఫలమయ్యాయని ఆరోపించింది. ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలని ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్, ట్రంప్ హెచ్చరికను తెలివితక్కువ చర్యగా అభివర్ణించింది. ఇరాన్‌కు చెందిన జనరల్ అలీ అబ్దుల్లాహి మాట్లాడుతూ, తమ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.

Advertisement