LOADING...
Iran: టెక్ దిగ్గజాలకు ఇరాన్ హెచ్చరిక.. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్ పై దాడుల ముప్పు
టెక్ దిగ్గజాలకు ఇరాన్ హెచ్చరిక.. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్ పై దాడుల ముప్పు

Iran: టెక్ దిగ్గజాలకు ఇరాన్ హెచ్చరిక.. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్ పై దాడుల ముప్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
09:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా టెక్ కంపెనీల కార్యాలయాలు, డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసిన నివేదికలో శత్రు టెక్నాలజీ మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామ‌ని అని పేర్కొంది. టెలిగ్రామ్‌లో చేసిన పోస్టులో ఖతర్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లలో ఉన్న మొత్తం 29 కార్యాలయాలు, డేటా సెంటర్లు, పరిశోధన కేంద్రాలను లక్ష్యాలుగా పేర్కొంది. ఈ జాబితాలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ తో పాటు ఎన్విడియా, పలాంటిర్ టెక్నాలజీస్, ఐబిఎం, ఒరాకిల్ కార్పొరేషన్ కంపెనీలు కూడా ఉన్నాయి.

Details

ఇరాన్ డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం

"ప్రాంతీయ యుద్ధం మౌలిక వసతుల యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో, ఇరాన్‌కు చట్టబద్ధమైన లక్ష్యాల పరిధి క్రమంగా విస్తరిస్తోందని టాస్నిమ్ పేర్కొంది. ఇదిలా ఉండగా గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్‌లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. దాడుల కారణంగా ఒక డేటా సెంటర్ దెబ్బతినడంతో అక్కడి ఉద్యోగులను అమెజాన్ తక్షణమే ఖాళీ చేయించింది. ఇరాన్ విడుదల చేసిన జాబితాలో కేవలం డేటా సెంటర్లే కాకుండా, పెద్ద నగరాల్లో ఉన్న ప్రకటనల కార్యాలయాలు మరియు పరిశోధన కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈబెదిరింపుల నేపథ్యంలో ఉద్యోగుల భద్రత కోసం కార్యాలయాలను మూసివేయడం వంటి చర్యలు తీసుకున్నారా అనే విషయంపై సంబంధిత కంపెనీలు ఇప్పటివరకు స్పందించలేదు.

Details

సుమారు 7 బిలియన్ డాలర్లకు కొనుగోలు

అదే సమయంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది. అలాంటి ప్రాంతాల నుండి కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలని ప్రజలకు సూచించింది. మధ్యప్రాచ్యంలో చాలా టెక్ కంపెనీలకు పెద్ద స్థాయి కార్యకలాపాలు ఉన్నాయి. డేటా నిల్వ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అనేక ప్రాంతీయ డేటా సెంటర్లు ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రముఖ కేంద్రంగా మారింది. ఎన్విడియాకు ఇజ్రాయెల్‌లో సూమారు 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2019లో ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ మెల్లనోక్స్ ను సుమారు 7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

Advertisement

Details

డేటా సెంటర్ ప్రాంతాన్ని ఏర్పాటు

అలాగే గూగుల్‌ ఖతర్‌లోని దోహాలో డేటా సెంటర్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. మైక్రోసాప్ట్‌ ఈ ఏడాది చివరికి సౌదీ అరేబియాలో కొత్త డేటా సెంటర్ ప్రారంభించేందుకు ప్రణాళికలు ప్రకటించింది. టెక్ కంపెనీల డేటా సెంటర్లపై జరిగిన గత వారం దాడులు, అమెరికాకు చెందిన టెక్ సంస్థల మౌలిక వసతులపై జరిగిన మొదటి సైనిక దాడులుగా భావిస్తున్నారు. ఈపరిణామాలు మధ్యప్రాచ్య దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు కృత్రిమ మేధస్సు(AI)మౌలిక వసతుల్లో ప్రధాన కేంద్రాలుగా ఎదగాలనే ప్రణాళికలకు దెబ్బ తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లు పెద్దవిగా ఉండటం, నిరంతర విద్యుత్ మరియు నెట్‌వర్క్ అవసరం ఉండటం వల్ల ఇలాంటి దాడులకు అవి సులభంగా లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

Advertisement