Page Loader
Iran: ఇరాన్ సుదూర దాడులు చేయగల అణ్వాయుధాలపై పనిచేస్తోంది: ఆస్ట్రియా నిఘా సంస్థలు
ఇరాన్ సుదూర దాడులు చేయగల అణ్వాయుధాలపై పనిచేస్తోంది: ఆస్ట్రియా నిఘా సంస్థలు

Iran: ఇరాన్ సుదూర దాడులు చేయగల అణ్వాయుధాలపై పనిచేస్తోంది: ఆస్ట్రియా నిఘా సంస్థలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ ప్రస్తుతం దీర్ఘశ్రేణి అణు క్షిపణుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తోందని ఆస్ట్రియాకు చెందిన నిఘా సంస్థలు తమ తాజా నివేదికల్లో వెల్లడించాయి. "ప్రాంతీయ రాజకీయ లక్ష్యాలను మరింత గట్టిగా ముందుకు నడిపించేందుకు, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను మళ్లీ పునఃస్థాపించేందుకు ఇరాన్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. అణ్వాయుధాలతో ఇతర దేశాల నుంచి వచ్చే దాడులకు తానెట్లా బలంగా తట్టుకోగలదో చూసుకుంటూనే, పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకునే యత్నాల్లో ఉంది" అని ఆ నివేదిక వివరించింది. ఇరాన్‌ అణు కార్యక్రమం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించినట్లు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా, చాలా దూర ప్రాంతాల్లో అణు వార్‌హెడ్‌లను ప్రయోగించగల సామర్థ్యాన్ని ఇరాన్‌ తన ఆయుధ భాండాగారంలో పెంచుకుంటూ వస్తోందని అందులో స్పష్టం చేశారు.

వివరాలు 

గూఢచారులతో  నిండి ఉన్న ఇరాన్‌ రాయబార కార్యాలయం

మొత్తం 211 పేజీల ఈ నివేదికలో ఏకంగా 99 సార్లు ఇరాన్‌ నుంచి ఎదురయ్యే ముప్పును ప్రస్తావించారు. ప్రత్యేకంగా వియన్నాలో ఉన్న ఇరాన్‌ రాయబార కార్యాలయం పూర్తిగా గూఢచారులతో నిండి ఉందని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో, ఈ అభిప్రాయాలకు వ్యతిరేకంగా అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ మతమర్చి మాట్లాడారు. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యల ప్రకారం, అమెరికా నిఘా సంస్థలు చేసిన తాజా అంచనాల ప్రకారం ఇరాన్‌ ఇప్పటి వరకు అణుబాంబు తయారు చేయలేదని పేర్కొన్నారు.