LOADING...
Ayatollah Ali Khamenei: మోసల్లా మసీదుకు అయతుల్లా ఖమేనీ భౌతికకాయం తరలింపు
మోసల్లా మసీదుకు అయతుల్లా ఖమేనీ భౌతికకాయం తరలింపు

Ayatollah Ali Khamenei: మోసల్లా మసీదుకు అయతుల్లా ఖమేనీ భౌతికకాయం తరలింపు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భౌతికకాయానికి అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని ముందుగా మరణించిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఇరానీ మీడియా వెల్లడించింది. అనంతరం టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా మసీదుకు తరలించారు. జూలై 4, 5వ తేదీల్లో రాజధాని టెహ్రాన్‌లో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఈ సందర్భంగా సుమారు రెండు కోట్ల మంది ప్రజలు తుది నివాళులు అర్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతరం వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇస్లామిక్ మత పెద్దలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

వివరాలు

శవపేటికపై ఇరాన్ జాతీయ పతాకం..

వచ్చే వారం ఖామ్, మషాద్ నగరాల్లో కూడా భారీ స్థాయిలో అంతిమయాత్రలు, నివాళి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఖమేనీ భౌతికకాయాన్ని టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా మసీదులో ఉంచారు. శుక్రవారం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనుండగా, శనివారం జరిగే ప్రార్థనల్లో పాల్గొనేందుకు పలు దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. మసీదుకు తరలించిన శవపేటికపై ఇరాన్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని కప్పారు.

వివరాలు

ఇరాన్‌లో తీవ్ర ఎండలు, హీట్‌వేవ్ పరిస్థితులు..

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఇరాన్‌లో తీవ్ర ఎండలు, హీట్‌వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అలాగే చైనా, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement