LOADING...
Donald Trump: చరిత్ర పునరావృతమా..? రీగన్ ఘటన జరిగిన హోటల్‌లోనే ట్రంప్‌పై దాడి!
చరిత్ర పునరావృతమా..? రీగన్ ఘటన జరిగిన హోటల్‌లోనే ట్రంప్‌పై దాడి!

Donald Trump: చరిత్ర పునరావృతమా..? రీగన్ ఘటన జరిగిన హోటల్‌లోనే ట్రంప్‌పై దాడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఇదే హోటల్‌లో గతంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, 1981 మార్చి 30న, నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇదే హోటల్‌కు వచ్చారు. అదే సమయంలో జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి అకస్మాత్తుగా రీగన్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Details

ఆ ఘటనకు మరోసారి ప్రాధాన్యం

ఈ ఘటనలో ఆయనతో పాటు ఉన్న ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ సహా మరో ముగ్గురు సిబ్బంది కూడా గాయపడ్డారు. వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు స్పందించి రీగన్‌ను జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాల్పులకు పాల్పడిన జాన్ హింక్లీ జూనియర్‌ను ఘటనాస్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన దర్యాప్తులో అతడు మానసిక అనారోగ్యంతో ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించి, కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ ఘటన తర్వాత స్థానికులు ఈ హోటల్‌ను 'హింక్లీ హిల్టన్'గా పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు ట్రంప్‌పై జరిగిన తాజా దాడి నేపథ్యంలో, ఈ చారిత్రక సంఘటన మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement