Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ మరణించారా? ఆయన మరణంపై పుకార్లకు ఒక కొత్త కుడ్యచిత్రం ఆవిష్కరణ ఎందుకు దారితీసింది?
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొంతకాలంగా విభిన్న వార్తలు వినిపించాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, కోలుకుంటున్నారని, ముఖానికి శస్త్రచికిత్స కూడా జరిగిందని ప్రచారం సాగింది. అంతేకాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర కొనసాగుతోందని కథనాలు వెలువడ్డాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇరాన్ ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులు ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. మీడియా కూడా ఈ విషయంపై అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ముజ్తాబా ఖమేనీ మరణించాడనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన ఇరాన్ నాయకుల కుడ్యచిత్రాన్ని మసీదులో ఆవిష్కరించారు.
వివరాలు
ముఖ శస్త్రచికిత్స
ఈ కార్యక్రమానికి ఇరాన్ ప్రభుత్వ పెద్దలంతా హాజరయ్యారు.ఆ కుడ్యచిత్రంలో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ముజ్తాబా ఖమేనీ సహా మరణించిన సైనిక,రాజకీయ ప్రముఖుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈచర్య ద్వారా ముజ్తాబా ఖమేనీ మరణంపై ఇరాన్ అధికారులు పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు జరిగాయి.ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే కుమారుడు మోజ్తాబా గాయపడ్డారని..ఆస్పత్రిలో కోలుకుంటున్నారని ఇప్పటి వరకు వార్తలొచ్చాయి.ఇటీవల ఆయనకు ముఖ శస్త్రచికిత్స కూడా జరిగిందని వార్తలు వెలువడ్డాయి. కానీ తాజాగా మసీదులో ఆవిష్కరించిన కుడ్యచిత్రంలో ఆయన చిత్రం కూడా ఉండటంతో,ముజ్తాబా ఖమేనీ కూడా మరణించినట్టేనని స్పష్టమవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మసద్‌లో కుడ్యచిత్రం ఆవిష్కరణ
INTERESTING: A new mural in Mashhad, Iran was unveiled honoring deceased Islamic Revolution figures.
— Open Source Intel (@Osint613) April 26, 2026
Some users were confused after current Supreme Leader Mojtaba Khamenei’s face appeared alongside deceased leaders, including his father. pic.twitter.com/imeEf8eEPd