ఇజ్రాయెల్ బాధలో ఉందన్న రిషి సునక్.. ఉగ్రవాదంపై ఉక్కుపాదంలో మేం కూడా జత కలుస్తామని స్పష్టం
ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య భయంకరమైన పోరు నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్నారు. గురువారం ఇజ్రాయెల్ లోని టెల్‌అవీవ్‌లో దిగిన రిషి, ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో కాసేపట్లో సమావేశం కానున్నారు. హమాస్‌తో పోరుపై ఇజ్రాయెల్‌తో కలిసి నడుస్తామని సునక్ ప్రకటించారు. తాను ఇజ్రాయెల్‌లో ఉన్నానని, ఇజ్రాయెల్ బాధలో ఉందని సునాక్ సంఘీభావం తెలిపారు. ఇప్పుడు,ఎప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఇజ్రాయెల్ పక్షాన నిలబడతానన్నారు. సునక్‌కు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ వచ్చి హమాస్‌కు వ్యతిరేకంగా తమ మద్దతు ఉంటుందన్నారు.గాజా ఆస్పత్రిపై హమాస్ రాకెట్ దాడులు జరిపిందని ఆరోపించిన ఇజ్రాయెల్ ఆధారాలనూ బట్టబయలు చేసింది.