Page Loader
Israel: "హమాస్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియాను మేమే చంపేశాం".. ధ్రువీకరించిన ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్ 
"హమాస్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియాను మేమే చంపేశాం"..

Israel: "హమాస్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియాను మేమే చంపేశాం".. ధ్రువీకరించిన ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2024
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇటీవల ఒక ప్రకటనలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను హత్య చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. హనియా జులైలో టెహ్రాన్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ దాడి ఇజ్రాయెల్ చేసినదే అని ఇరాన్ అప్పుడే ఆరోపించింది, కానీ,టెల్‌అవీవ్‌ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాట్జ్ ఈ సందర్భంగా హుతీలతో సహా అనేక ఉగ్రవాద సంస్థలను ఎదుర్కొన్న విషయాలను ప్రస్తావించారు. ఆయన చెప్పినట్లుగా, ఇజ్రాయెల్ హమాస్, హెజ్‌బొల్లా, ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది, అలాగే సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను కూల్చివేసింది.

వివరాలు 

హూతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు

ఈ దాడులు కొనసాగుతున్న క్రమంలో గాజా, యెమెన్‌లోని హూతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తూనే ఉన్నారు. హూతీలు తమ దాడుల ద్వారా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారని చెబుతుండగా, ఇజ్రాయెల్ సైన్యం వారికి ప్రతిస్పందిస్తూ వారి సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేస్తోంది.