Page Loader
గాజాలో రాత్రివేళ బలగాలు పరిమిత దాడులే నిర్వహిస్తాయి : ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి
ఇజ్రాయెల్ భూ బలగాలు రాత్రిపూట గాజాలో పరిమిత దాడులు నిర్వహిస్తాయి ఇజ్రాయెల్ భూ బలగాలు రాత్రిపూట గాజాలో పరిమిత దాడులు నిర్వహిస్తాయి ఇజ్రాయెల్ భూ బలగాలు రాత్రిపూట గాజాలో పరిమిత దాడులు నిర్వహిస్తాయి ఇజ్రాయెల్ భూ బలగాలు రాత్రిపూట గాజాలో పరిమిత దాడులు నిర్వహిస్తాయి గాజాలో రాత్రివేళ బలగాలు పరిమిత దాడులే నిర్వహిస్తాయి

గాజాలో రాత్రివేళ బలగాలు పరిమిత దాడులే నిర్వహిస్తాయి : ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 23, 2023
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ క్షేత్రస్థాయి బలగాలు రాత్రి వేళల్లో పరిమిత స్థాయిలోనే దాడులు నిర్వహిస్తాయి. ఈ మేరకు ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్‌లోని దాదాపు 320కి పైగా హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హమాస్ మిలిటెంట్లతో పోరాడేందుకు గాజా స్ట్రిప్‌లో రాత్రిపూట "పరిమిత" దాడులు నిర్వహించామని, ఇకపై ఇదే విధానాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ మిలటరీ చెప్పింది. అయితే ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు హమాస్ సమావేశమైన ప్రదేశాల ధ్వంసమే లక్ష్యంగా దాడులు చేసినట్లు వివరించారు. రాత్రి సమయాల్లో ట్యాంక్, పదాతిదళాల ద్వారా దాడులు జరిగాయన్నారు. బందీల సమాచారాన్ని కనుగొనేందుకు తమ దళాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాత్రిళ్లు పరిమిత స్థాయిలోనే గాజాపై దాడులు కొనసాగిస్తామన్న ఐడీఎఫ్