Page Loader
Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి 
నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది

Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Oct 09, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరు వర్గాల పరస్పర దాడులతో పశ్చిమాసియా నెత్తురోడుతోంది. యుద్ధం ప్రారంభమై సోమవారానికి మూడో రోజులు కాగా, ఇప్పటి వరకు రెండు దేశాల్లో కలిపి 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఇజ్రాయెల్‌ నుంచే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇజ్రాయెల్‌‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పాలస్తీనా గాజాలో 413 మంది మృతి చెందారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ దాడి సుదీర్ఘమైన, సవాలుతో కూడిన యుద్ధానికి నాందిగా ఆయన పేర్కొన్నారు. హమాస్ మిలిటెంట్ గ్రూప్ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు.

హమాస్

ఒకేచోట 260 మందిని ఊచకోత కోసిన హమాస్ మిలిటెంట్లు 

ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ హమాస్ గ్రూప్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించారు. ఇజ్రాయెల్‌లో ఓ సంగీత కార్యక్రమంలోకి ప్రవేశించి, 260 మందిని ఊచకోత కోశారు. ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ జకా నివేదించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని పలు సభ్య దేశాలు హమాస్‌ను చర్యను తీవ్రంగా ఖండించాయి. దీనిపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, హమాస్‌తో యుద్దం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలువాలని అమెరికా నిర్ణయించింది. విమాన వాహక నౌక, యుద్ధనౌకల సమూహాన్ని తూర్పు మధ్యధరా ప్రాంతానికి పంపేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లను పెంచుతున్నట్లు ఆస్టిన్ తెలిపారు.

హమాస్

హమాస్ దాడి వెనుక ఇరాన్ పాత్ర

హమాస్, హిజ్బుల్లా సీనియర్ సభ్యులు వాల్ స్ట్రీట్ జర్నల్‌తో కీలక విషయాలను చెప్పారు. ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులను నిర్వహించడంలో ఇరాన్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారులు, గాజాలోని హమాస్, హిజ్బుల్లాతో సహా నాలుగు ఇరాన్-మద్దతు గల మిలిటెంట్ గ్రూపుల ప్రతినిధులు హాజరై ఇజ్రాయెల్‌పై దాడికి పథకరచన చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజా శరణార్థుల శిబిరంలో ఉంటున్న పాలస్తీనా కుటుంబానికి చెందిన 19మంది మరణించారు. తమ వద్ద 30మందికి పైగా ఇజ్రాయెల్‌లు బందీలుగా ఉన్నారని ఇస్లామిక్ జిహాద్ చీఫ్ జియాద్ అల్-నఖలా చెప్పారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే, వీరిని విడిచి పెడతామని హెచ్చరికలు పంపాడు.