Israel : హమాస్ మిలిటెంట్లు ఎంత ఘోరం చేశారు.. ఐదుగురి పిల్లల తల్లి హత్య
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలు కాకముందే అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దేశంపై అనూహ్యంగా విరుచుకపడింది. ఈ మేరకు 65 ఏళ్ల వృద్ధురాలిని బందీగా తీసుకెళ్లారు.అంతకుముందే ఆమె భర్త ష్ములిక్ వీస్ ను ఇంట్లోనే హత్య చేశారు. యెహుదిత్ వీస్ కిండర్ గార్టెన్ కిడ్స్ కోసం పని చేస్తోంది. అక్టోబరు 7న, యెహుదిత్‌ను హమాస్ కిబ్బట్జ్ బీరీలోని ఆమె ఇంటి నుంచి అపహరించింది. శుక్రవారం తెల్లవారుజామున గాజాలోని షిఫా ఆస్పత్రి ఎదురుగా ఉన్న భవనం వద్ద ఐడీఎఫ్ సైనికులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు యెహుదిత్ మృతదేహం ఉన్న చోట AK-47లు, RPGలు, సైనిక పరికరాలను కనుగొన్నారు. వీస్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నామని ఐడీఎఫ్ దళాలు పేర్కొన్నాయి.