Page Loader
Israel Hamas War : హమాస్‌ కీలక అధికార ప్రతినిధిని అరెస్ట్‌ చేసిన ఇజ్రాయెల్ దళాలు
హమాస్‌ అధికార ప్రతినిధిని అరెస్ట్‌ చేసిన ఇజ్రాయెల్

Israel Hamas War : హమాస్‌ కీలక అధికార ప్రతినిధిని అరెస్ట్‌ చేసిన ఇజ్రాయెల్ దళాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 20, 2023
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్‌ ఉగ్రవాద సంస్థ అధికార ప్రతినిధి హసన్‌ యూసఫ్‌ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లో నిర్వహించిన భీకర దాడుల్లో హసన్ యూసఫ్ ను అదుపులోకి తీసుకున్నాయి. హమాస్‌ కోసం పలు కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా అదుపులోకి తీసుకున్నామని ఇజ్రాయెల్‌ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ వెల్లడించింది. హసన్ యూసఫ్‌, పాలస్తీనాలోని శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హమాస్‌ అధికార ప్రతినిధిగా కొనసాగుతూనే వెస్ట్‌బ్యాంక్‌ చట్టసభల్లోనూ సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్‌కు చెందిన 60 మంది కీలక సభ్యులను ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్ బంధించింది. ఒకప్పుడు యూసఫ్‌ సుమారు 24 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయాడు.

details

దాడులు ఆపితే 200 మంది బందీలను అప్పగిస్తామన్న హసన్

మరోవైపు హమాస్‌ ప్రతినిధిగా అంతర్జాతీయ మీడియాలోనూ హసన్ తరచుగా కనిపిస్తుంటాడు. ఇజ్రాయెల్‌ వాయుసేన దాడులు ఆపాలని, అందుకు ప్రతిఫలంగా 200 మంది బందీలను హమాస్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరగుతాయని హసన్ తెలిపారు. గాజాను ఇజ్రాయెల్ చుట్టుముట్టడంతో ఇంధనం, నీటికి, విద్యుత్ సౌకర్యానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా చాలా వైద్యశాలలు మూతపడుతున్నాయి. ఐరాసకు చెందిన ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యూమానిటేరియన్‌ అఫైర్స్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. గాజాలో కార్యకలాపాలు నిర్వహించే కేర్‌ సంస్థకు చెందిన 60 ఆఫీసులు, ఆస్పత్రులు మూతపడ్డాయని వివరించింది. తమకు చమురు, ప్రజలకు పరిశుభ్రమైన నీరు అవసరమని కేర్‌ సంస్థ గాజా డైరెక్టర్‌ హిబా టిబి అన్నారు. ప్రస్తుతం గాజాలో ఇవి అందుబాటులో లేవని, ఉంటే మెరుగుపడుతామన్నారు.