
Israel : ఆస్పత్రులే స్థావరాలుగా, సొరంగం ద్వారా హమాస్ మిలిటెంట్లు ఏం చేస్తున్నారో చూడండి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ మేరకు గాజా స్ట్రిప్‌లోని ఆస్పత్రులను హమాస్ మిలిటెంట్లు ఆక్రమించుకుంటున్నారని ఐడీఎఫ్ (IDF) వెల్లడించింది.
ఈ క్రమంలోనే హమాస్ ఆచూకీకి సంబంధించి ఇజ్రాయెల్ ఓ వీడియో సాక్ష్యాన్ని రిలీజ్ చేసింది.
ఆదివారం ట్యాంకులు, యుద్ధ విమానాలతో వరుస బాంబు దాడులు చేస్తూ గాజాను బెెంబెలెత్తించింది. హమాస్, తమ తీవ్రవాద ప్రయోజనాల కోసం గాజా స్ట్రిప్‌లోని ఆస్పత్రులను, ఆరోగ్య సౌకర్యాలను ఉపయోగిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.
గాజాలో ఉన్న షేక్ హమద్ హాస్పిటల్ వీడియోను ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి విడుదల చేశారు.
హమాస్ మిలిటెంట్లు భూగర్భ సొరంగాల్లోకి ప్రవేశించేందుకు ఉపయోగించే భాగాన్ని ఇందులో కనిపిస్తుండటం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షేక్ హమద్ హాస్పిటల్ వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రతినిధి
In a briefing to international media outlets, IDF Spokesman Rear Adm. Daniel Hagari reveals new intelligence information and evidence showing Hamas's use of medical facilities in the Gaza Strip for terror purposes.
— Emanuel (Mannie) Fabian (@manniefabian) November 5, 2023
Hagari presents a video showing an underground entrance from… pic.twitter.com/CzRyXnwnel