ISRAEL : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు లభ్యం.. ఇజ్రాయెల్ దళాల గాలింపులు
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐడీఎఫ్ దళాలు గాజాలోని ఆస్పత్రుల్లో గాలింపులు కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు మిలిటెంట్లు ఆస్పత్రులను అధీనంలోకి తీసుకుని పెద్ద సంఖ్యలో ఆయుధాలను భద్రపర్చారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ క్రమంలోనే అల్ షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో ఆయుధాల వాహనాన్ని తమ దళాలు గుర్తించాయని తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు, అల్ షిఫాను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని గురువారం వివరించింది. గాజా అల్ షిఫా ఆసుపత్రి దిగువన సొరంగంలో హమాస్ కమాండ్ సెంటరును నిర్మించిందని పేర్కొంది. ఆస్పత్రిలో నవజాత శిశువులతో సహా వేలాది రోగులపై ఇజ్రాయెల్ దాడిని UNO,మధ్యప్రాచ్య దేశాలు ఖండించాయి. దీంతో ఆయుధాలు, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని ఆస్పత్రి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం వీడియోలో బహిర్గతం చేసింది.