LOADING...
Iran- Israel: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ మళ్లీ ముదిరింది.. ట్రంప్‌ సీస్‌ఫైర్ విఫలం
ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ మళ్లీ ముదిరింది.. ట్రంప్‌ సీస్‌ఫైర్ విఫలం

Iran- Israel: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ మళ్లీ ముదిరింది.. ట్రంప్‌ సీస్‌ఫైర్ విఫలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతకొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను అల్లకల్లోలానికి గురిచేశాయి. తాజాగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో పరిస్థితి సద్దుమణుగుతుందని అందరూ భావించారు. అయితే ఈ ఒప్పందం కుదిరిన కొద్ది గంటలకే ఇరాన్‌ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. 2 గంటల్లోనే ఉల్లంఘన సీస్‌ఫైర్‌ అమల్లోకి వచ్చిన రెండు గంటలకే ఇరాన్‌ రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటనలో తెలిపింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై గట్టిగా స్పందించాలని రక్షణ మంత్రి కాట్జ్‌ ఐడీఎఫ్‌కి ఆదేశించారు. అంతేకాక టెహ్రాన్‌ కీలక ప్రదేశాలే లక్ష్యంగా దాడులు చేయాలని సూచించినట్టు వెల్లడించారు.

Details

ఇజ్రాయెల్‌ నివాస ప్రాంతంలో మృతులు 

ఇరాన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణి ఒకటి బీర్‌షెబాలోని నివాస భవనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, డజనుకిపైగా వ్యక్తులకు గాయాలయ్యాయని తెలిసింది. ఇరాన్‌ ఖండన తాము కాల్పుల విరమణను ఉల్లంఘించలేదని ఇరాన్‌ ఖండించింది. ఇజ్రాయెల్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. 'తాము ఎలాంటి క్షిపణులను ప్రయోగించలేదని' ఇరాన్‌ ప్రకటించింది.

Details

ఘర్షణల మళ్లీ ముదిరే అవకాశం 

ఇరాన్‌ క్షిపణుల దాడిని ఇజ్రాయెల్‌ ఆరోపించడం వెంటనే ప్రతిస్పందనకు దారితీసింది. దీంతో మిడిల్‌ ఈస్ట్‌ పరిణామాలు మరింత ఉద్రిక్తతకు లోనయ్యాయి. ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన సీస్‌ఫైర్‌ 24 గంటలు కూడా నిలువకపోవడంతో, ఇరాన్-ఇజ్రాయెల్‌ ఘర్షణలు మళ్లీ ముదిరే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధ విరమణ ఒప్పందం కూలిన నేపథ్యంలో ప్రపంచం ఉత్కంఠతో పరిణామాలను గమనిస్తోంది.