Israel: ఇజ్రాయెల్ సైన్యం మాస్టర్ ప్లాన్.. హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
గాజా స్ట్రిప్‌లో హమాస్ సొరంగాల నెట్‌వర్క్ లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది.
హమాస్‌కు కీలక స్థావరాలైన సొరంగాలను పంపుసెట్ల ద్వారా నీటిని నింపేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది.
ఇజ్రాయెల్ సైన్యం మధ్యధరా సముద్రం నుంచి పంప్ చేయబడిన నీటితో హమాస్ సొరంగాలను నింపడానికి ఇప్పటికే ఒక ప్రణాళికను రూపొందించింది.
ఇందుకోసం భారీ పంపుల వ్యవస్థను ఇజ్రాయెలె రూపొందిస్తోంది.
గాజా స్ట్రిప్ క్రింద ఉన్న హమాస్ విస్తారమైన సొరంగాలను సముద్రపు నీటితో నింపడం వల్ల.. అందులోని హమాస్ మిలిటెంట్లు బయటకు వస్తారని ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్ వేసింది.
హమాస్
ఈ ప్లాన్ గురించి అమెరికాకు ముందే చెప్పిన ఇజ్రాయెల్
ఈ ప్రణాళికలను ముందే రచించి పెట్టుకున్న ఇజ్రాయెల్ సైన్యం.. గత నెలలో గాజా నగరంలోని అల్షాతి శరణార్థి శిబిరం సమీపంలో ఐదు పెద్ద పంపింగ్ సెట్లను ఏర్పాటు చేసింది.
ఈ పంపు సెట్లు ప్రతి గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటిని పంప్ చేస్తుంది.
ఈ ప్రణాళిక గురించి ఇజ్రాయెల్ గత నెలలో అమెరికాకు చెప్పిందని, అయితే దానిని అమలు చేయాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యూహంతో సొరంగాలను నాశనం చేయడం ద్వారా హమాస్ మిలిటెంట్ల స్థావరాలను నాశనం చేయొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది.
కానీ.. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల గాజా నీటి సరఫరా వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.