LOADING...
Israel: స్థానికంగా భారీ బాంబుల తయారీకి ఇజ్రాయెల్‌ సిద్ధం!
స్థానికంగా భారీ బాంబుల తయారీకి ఇజ్రాయెల్‌ సిద్ధం!

Israel: స్థానికంగా భారీ బాంబుల తయారీకి ఇజ్రాయెల్‌ సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ ఆయుధ సరఫరాలో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో కీలకమైన అడుగులు వేస్తోంది. ఎల్బిట్‌ సిస్టమ్స్‌తో కలిసి స్థానికంగానే భారీ బాంబులను ఉత్పత్తి చేయడానికి రెండు ప్రధాన ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతోపాటు, సరికొత్త ముడిపదార్థాల ప్లాంట్‌ను కూడా ఏర్పాటుచేయనుంది. మొదటి ఒప్పందంలో, ఎల్బిట్‌ సంస్థ ఇజ్రాయెల్‌ వాయుసేనకు వేలకొద్ది భారీ బాంబులు సరఫరా చేస్తుంది. ఈ నిర్ణయం, ఆయుధ సరఫరాలో అమెరికా విధించిన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్నదిగా ఇజ్రాయెల్‌ రక్షణశాఖ తెలిపింది. అమెరికా ఇటీవల ఒక షిప్‌మెంట్‌ను నిలిపివేయడం టెల్‌అవీవ్‌ను ఇబ్బందిలో పడేసింది. రెండో ఒప్పందంలో భాగంగా, ఇజ్రాయెల్‌ ముడిపదార్థాలను స్వదేశంలోనే ఉత్పత్తి చేసేందుకు ఎల్బిట్‌ సంస్థతో కలిసి పనిచేయనుంది.

Details

ఇజ్రాయెల్ రక్షణ రంగంలో కొత్త మైలురాయి

ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిని ఇకపై స్థానికంగానే తయారుచేసే అవకాశం కల్పించనుంది. ఈ ఏడాది మేలో అమెరికా తాత్కాలికంగా 2000 పౌండ్ల బరువైన 1800 బాంబులు, 500 పౌండ్ల బరువైన 1700 బాంబుల సరఫరాను నిలిపివేసింది. రఫా ప్రాంత పరిణామాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ తెలిపారు. ఈ పరిస్థితులు ఇజ్రాయెల్‌ను ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధి వైపు దిశ మార్చుకోవడానికి ప్రేరేపించాయి. ఇజ్రాయెల్‌ తీసుకున్న ఈ నిర్ణయం, ఐడీఎఫ్‌ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో కీలకమని అక్కడి రక్షణశాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ రంగంలో స్వయం సమృద్ధిని లక్ష్యంగా చేసుకొని అడుగులు వేస్తూ, ఇజ్రాయెల్‌ రక్షణ రంగంలో కొత్త మైలురాయిని చేరుకుంటోంది.