Israel : భీకర పోరులో ఇజ్రాయెల్ దళాలు.. హమాస్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు గాజా సిటీలోని హమాస్ పార్లమెంటులో ఇజ్రాయెల్ సైన్యం అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే దాదాపుగా 40 రోజులుగా సాగుతున్న భీకరమైన యుద్ధంలో భాగంగా మంగళవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ దేశ జెండాలతో హమాస్ పార్లమెంట్ భవనాన్ని చేజిక్కిచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇజ్రాయెల్ దళాలు విడుదల చేశాయి. గత 40 రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా దళాలు గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా కదులుతోంది. ఈ క్రమంలోనే లక్షలాది ఇజ్రాయెల్ సైన్యం గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ఉద్ధృతం చేసింది.
సామాన్యులను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది : హమాస్
గాజాలో ఇజ్రాయెల్ పాలన ప్రారంభం అని అంతర్జాతీయ దేశాల దౌత్యవేత్తలు, నిపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యంతో జరిగిన పోరాటంలో హమాస్ కు చెందిన కీలక నేతలు దాదాపుగా నేలమట్టం అయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేసింది. ఫలితంగా హమాస్ సైన్యానికి మార్గదర్శకం చేసేవారు లేక హమాస్ మిలిటెంట్లు నెమ్మదించే అవకాశం ఉంది. మరోవైపు సామాన్యులను అడ్డుపెట్టుకుని గాజాలోని ఆస్పత్రులను ఆధీనంలోకి తీసుకుని ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోందని హమాస్ విమర్శిస్తోంది. పాలస్తీనా అధీనంలోని హమాస్ గాజాలో ఇజ్రాయెల్ దళాలు తమ దేశపు జెండాలు ఎగరేయటం హమాస్ కొసమెరుపు. మరికొన్ని రోజులు ఇదే రీతిలో యుద్ధం చేసి గాజా మొత్తాన్ని ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.