Page Loader
Israel Warning : గాజాను 11 ల‌క్ష‌ల మంది ఖాళీ చేయాల్సిందే.. వినాశకరమంటున్న ఐక్యరాజ్య సమితి 
వినాశకరమంటున్న ఐక్యరాజ్య సమితి

Israel Warning : గాజాను 11 ల‌క్ష‌ల మంది ఖాళీ చేయాల్సిందే.. వినాశకరమంటున్న ఐక్యరాజ్య సమితి 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 13, 2023
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ చేసేందుకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గాజాలోని ఉత్తరాదిలో ఉన్న సుమారు 11 ల‌క్ష‌ల మంది 24 గంట‌ల్లోగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. శరణార్థులంతా ద‌క్షిణ గాజా దిశ‌గా త‌ర‌లివెళ్లాల‌ని సూచించింది. మరోవైపు ఇదే విష‌యాన్ని ఐక్య‌రాజ్య‌ స‌మితికి చెప్పేసింది. హ‌మాస్‌ను పూర్తిగా భూస్థాపితం చేయాలన్న ల‌క్ష్యంతో ఇజ్రాయెల్ భారీ సైనిక చ‌ర్య‌కు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే గాజాలో గ్రౌండ్ ఆప‌రేష‌న్ మొదలుపెట్టనుంది. ఇప్పటికే 7వ రోజూ కొనసాగుతున్న యుద్ధంలో గాజాపై పూర్తిస్థాయి ప‌ట్టు కోసం ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది. గాజాలోని ఉత్త‌రాన దాదాపు 11 ల‌క్ష‌ల మంది పాల‌స్తీనియ‌న్లు జీవిస్తున్నారు.

DETAILS

నేలపై నుంచి దాడుల చేసేందుకే గాజా వాసులను ఖాళీ చేయిస్తున్న ఇజ్రాయెల్

మరోవైపు అతి త‌క్కువ స‌మ‌యంలో అంత పెద్ద మొత్తంలో ఉన్న జనాల్ని త‌ర‌లించ‌డం సులువైన విషయం కాదని ఐక్య‌రాజ్య‌స‌మితి (UNO) ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఆదేశాలు గనక ఇజ్రాయెల్ ఇస్తే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించింది. మరోవైపు ఇరాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అంత పెద్ద ఎత్తున ప్రజల్ని తరలిస్తే సమస్య మరో రూపం దాల్చుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ పై భూమి, ఆకాశం,సముద్ర మార్గాల్లో హమాస్ ఏకకాలంలో మెరుపుదాడులు చేస్తోంది. హమాస్ తమపై దాడులు చేస్తున్న గాజా ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరంగా పోరాడుతోంది. ఈ క్రమంలోనే భూమిపై నుంచి హమాస్ పై దాడి చేసేందుకే గాజా వాసులను ఖాళీ చేయాలని హెచ్చరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

1.1 మిలియన్ల గాజా వాసులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు