Page Loader
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం 
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం 

వ్రాసిన వారు Stalin
Oct 09, 2023
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్‌' దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌-సౌదీ అరేబియా మధ్య ఒప్పందానికి జరుగుతున్న చర్చలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్ తన ఆధిపత్యాన్ని చలాయించడానికి ఇజ్రాయెల్‌ను ఒంటరిని చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ అమెరికా అండతో శత్రు దేశాలను కూడా ఇజ్రాయెల్‌ మిత్ర దేశాలుగా మార్చుకుంటోంది. 1970కి ముందు ఇజ్రాయెల్ అంటే ఈజిప్టు ఒంటికాలుపై లేచేది. కానీ ఆమెరికా మధ్యవర్తతిత్వంతో 1979లో ఇజ్రాయెల్-ఈజిప్టు మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత యూఏఈ, బహ్రెయిన్‌ కూడా ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. కొంతకాలంగా అరబ్ దేశాల్లో కీలకమైన సౌదికి దగ్గరయ్యేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య ఒప్పందానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

హమాస్

హమాస్‌ను పెంచి పోషిస్తున్న ఇరాన్

ఒకవేళ.. సౌదితో ఒప్పందం కుదిరితే, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ శక్తిమంతంగా తయారవుతోంది. అలాగే మిగతా ముస్లిం దేశాలు కూడా యూదు దేశమైన ఇజ్రాయెల్‌కు స్నేహ హస్తాన్ని చాటే అవకాశం ఉంది. ఇరాన్ మొదటి నుంచి ఇజ్రాయెల్‌ను దేశంగా పరిగణించడం లేదు. అలాంటిది దేశంలో బలపడటం ఇరాన్‌కు అసలు రుచించడం లేదు. దీంతో ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇరాన్ హమస్‌ గ్రూప్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్ల కార్యక్షేత్రం పాలస్తీనాలోని గాజా అయినా.. ఈ సంస్థకు ఆయుధాలు, నిధులను సమకూర్చేది ఇరన్ అనేది బహిరంగ రహస్యం. సౌదీ-ఇజ్రాయెల్ మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్న క్రమంలో ఇరుదేశాలకు హెచ్చరికలు జారీ చేసేందుకు హమాస్ గ్రూప్‌తో ఇరాన్ దాడి చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.