
America -Isreal: ఇజ్రాయెల్ కు చెందిన నెట్జా యోహూదా పై అమెరికా ఆంక్షలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో (America)ని బైడెన్ ప్రభుత్వం తొలిసారి ఇజ్రాయెల్( Isreal)పై చర్యలు తీసుకోనుంది.
వెస్ట్ బ్యాంక్ (West Bank) లోని పాలస్తీనా (Palasteena) పౌరులకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ కు చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) యూనిట్‌పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆక్సియో న్యూస్ సైట్ శనివారం వెల్లడించింది.
నెట్జా యోహుదా (Netzha Yeheda) బెటాలియన్ పాలస్తీనియన్లపై హింస, మితవాద తీవ్రవాదం వంటి వివాదాలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన పాలస్తీనీయుడైన ఒమర్ అసద్ అనే 78 వ్యక్తిని నెట్జా యోహుదా బెటాలియన్ అదుపులోకి తీసుకుంది.
అతడి కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసింది.
Sanctions Imposed by America
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన కథనంతోనే...
అతడిని ఆ బెటాలియన్ తీవ్రంగా హింసించి పూర్తిగా గడ్డకట్టుకుపోయిన పరిస్థితుల్లో అతడిని వదిలివేసింది.
దీంతో ఒమర్ అసద్ మృతి చెందాడు.
ఈ ఘటన టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మీడియాలో వచ్చింది.
దీంతో అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్ కు చెందిన నెట్జా యోహూదా బెటాలియన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆంక్షలు విధించాలనుకుంటున్న అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ జీర్ణించుకోలేకపోతున్నారు.
దీనిని నైతిక పతనాల్లో దీనికి మించినది లేనిదిగా నెతన్యాహూ అభివర్ణించారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పై అమెరికా ఆంక్షలు విధించకూడదని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు.
ఇటీవలే నేను సీనియర్ అమెరికన్ ప్రభుత్వాధికారులతో మాట్లాడానని తెలిపారు.
Baiden-Nethanyahu
ఆంక్షలు విధించాలనుకోవడం సరికాదు: నెతన్యాహూ
మా సైనికులు తీవ్రవాద రాక్షసులతో పోరాడుతున్న తరుణంలో, ఐడిఎఫ్‌లోని ఒక యూనిట్‌పై ఆంక్షలు విధించాలనుకోవడం సరికాదు.
నా నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికా విధించబోయే ఆంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
నెట్జా యెహుడా సైనికులపై ఆంక్షలు విధించడం రెడ్ లైన్ దాటడమేనని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ జివిర్ అభిప్రాయపడ్డారు.
బెటాలియన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోకపోతే, దానిని ఆ దేశ సరిహద్దు పోలీసులతో అనుసంధానం చేయమని కోరతానని ఆయన చెప్పారు.
నెట్జా యెహూదా ఎక్కువగా అల్ట్రా-ఆర్థోడాక్స్ పదాతిదళ విభాగం.
మహిళా సైనికులతో సంభాషించడానికి కూడా సైనికులను అనుమతించరు. మతపరమైన అధ్యయనం, ప్రార్థనల కోసం వారికి అదనపు సమయం ఇస్తారు.