
Iran -Israel: ఇజ్రాయెల్‌లోని పెద్ద మెడికల్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. రెండు దేశాల మధ్య బాంబుల దాడులు అత్యంత ఉధృత స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతుండగా, ఇజ్రాయెల్ కూడా దాడులకు దీటుగా సమాధానం ఇస్తోంది. అయితే, ఇరాన్ వదిలిన బాలిస్టిక్ క్షిపణుల ప్రభావంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ గణనీయంగా దెబ్బతింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, విద్యాసంస్థలు, నివాస ప్రదేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక చోట్ల ప్రాణనష్టం చోటుచేసుకున్నట్టు సమాచారం.
వివరాలు
బీర్‌షెబాలోని సోరోకా ఆసుపత్రిపై దాడి
ఇటీవల ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని అనేక ప్రధాన నగరాల్లో విలయం సృష్టించాయి. టెల్ అవీవ్, రామత్‌గాన్, హోలోన్, బీర్‌షెబా వంటి నగరాలపై దాడులు జరిపిన ఇరాన్, అక్కడి ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. బీర్‌షెబాలోని సోరోకా ఆసుపత్రిపై జరిగిన దాడి కారణంగా భవనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వైద్య సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. పలువురు గాయపడినట్టు తెలియగా, అత్యవసర సహాయ సిబ్బంది వేగంగా స్పందించి గాయపడిన వారిని రక్షించారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవబడుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాణభయంతో పరుగులు తీసిన రోగులు, వైద్య సిబ్బంది
🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV
— Breaking911 (@Breaking911) June 19, 2025
వివరాలు
ఆసుపత్రిపై జరిగిన దాడితో భారీగా ఆస్తినష్టం
అంతేకాక,హోలోన్ ప్రాంతంలోని నివాస భవనాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం,ఈ దాడుల్లో అనేక మంది పౌరులు గాయపడ్డారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిపై జరిగిన దాడితో భారీగా ఆస్తినష్టం సంభవించింది. టెల్ అవీవ్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై జరిపిన క్షిపణి దాడులు ఆ భవనాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇది జరుగడానికి ముందు బుధవారం రోజు,ఇరాన్ అణుశక్తిని అధిక శక్తి స్థాయికి చేరనివ్వకూడదనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు ప్రారంభించింది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ క్షిపణుల వర్షం కురిపించింది.
వివరాలు
ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగాలపై ఘోర విధ్వంసం
యురేనియం శుద్ధికి అవసరమైన సెంట్రీఫ్యూజ్‌ల తయారీ కేంద్రాలపై తీవ్రమైన దాడులు నిర్వహించింది. అంతేకాకుండా, ఆయుధాల ఉత్పత్తికి ఉపయోగించే కర్మాగారాలపై వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించి విరుచుకుపడింది. ఇరాన్‌లోని అంతర్గత భద్రతా విభాగ ప్రధాన కార్యాలయంపై కూడా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులు వేసినట్టు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ సైతం తమ క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగాలపై ఘోర విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన కౌంటర్ దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మృతి చెందినట్టు సమాచారం. బుధవారం రోజు ఇజ్రాయెల్ వైమానిక సేన 10 క్షిపణులను పతనంచేసినట్టు ప్రకటించింది.
వివరాలు
ఇజ్రాయెల్ F-35 యుద్ధ విమానాన్నినేలకూల్చిన ఇరాన్
అలాగే జవాదాబాద్ ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ భద్రతా దళాలు నేలకూల్చాయి. రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్‌ను కూడా ధ్వంసం చేశాయి. ఫతాహ్ అనే అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ బుధవారం ప్రకటించిన సమాచారం ప్రకారం, శుక్రవారం నుంచి ఇప్పటిదాకా వారి దేశంలో 15,871 భవనాలు, సుమారు 1,300 వాహనాలు, 1,633 రకాల ఆస్తులు పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది.