
గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది; అమెరికా సూచనను తిరస్కరించిన నెతన్యాహు
ఈ వార్తాకథనం ఏంటి
గాజా కేంద్రంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర గాజా నుండి గాయపడిన వ్యక్తులను తీసుకువెళుతున్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
ఇందులో 15 మంది మరణించారు. 60 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంబులెన్స్ పై దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది.
పలు దేశాలు ఈ దాడిని ఖండించాయి. అయితే అంబులెన్స్ పై దాడిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. అంబులెన్స్‌లో చనిపోయింది గాయపడిన వారు కాదని, హమాస్ మిలిటెంట్లు అని పేర్కొంది.
హమాస్ సంస్థ ఆయుధాల తరలింపుకు హమాస్ మిలిటెంట్లు అంబులెన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం దానిని గుర్తించి దాడి చేసినట్లు వెల్లడించింది.
హమాస్
ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు అవాస్తవం: హమాస్
ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు అవాస్తవమని, అంబులెన్స్‌లో తమ సైనికులు లేరని హమాస్ అధికారి ఎజాత్ అల్-రేషిక్ తెలిపారు.
గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసిన దాడుల్లో అంబులెన్స్ ఉందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-కిద్రా తెలిపారు.
అంతేకాకుండా అనేక అంబులెన్స్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు కిద్రా ఆరోపించారు. అయితే అంబులెన్స్‌పై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నగర వీధిల్లో అంబులెన్స్ పక్కన రక్తసిక్తులైన వ్యక్తులు నిలబడి ఉన్నారని, చాలా మంది ప్రజలు సహాయం కోసం పరిగెత్తడం ఆ వీడియాలో కనిపిస్తుంది.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం తన వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలను ఇంకా అందించలేకపోయింది.
హమాస్
గాజాలో వైద్యసాయం చేయడం తమ వల్ల కాదు: యూఎన్ ఏజెన్సీ యూఎన్ఆర్‌డబ్ల్యూఏ
రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్‌లపై దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. ఈ వార్తలు తనను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు.
ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సదుపాయాలను తప్పనిసరిగా రక్షించాలని అన్నారు. పాలస్తీనా శరణార్థుల కోసం తాము గాజాలో కార్యకలాపాలు కొనసాగించడం సాధ్యం కాదని యూఎన్ ఏజెన్సీ యూఎన్ఆర్‌డబ్ల్యూఏ(UNRWA) డైరెక్టర్ థామస్ వైట్ పేర్కొన్నారు.
50 కంటే ఎక్కువ ఐక్యరాజ్యసమితి సౌకర్యాలు ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైనట్లు వివరించారు. యూఎన్ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వేల మంది పాలస్తీనియన్లకు భద్రత కల్పించలేమని చెప్పారు.
గాాజా
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌పై అమెరికా ఒత్తిడి
గాజాలో మానవతావాద సాయం కోసం కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌పై తాను ఒత్తిడి తెచ్చానని అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. శనివారం జరిగిన చర్చలలో అనేక చట్టబద్ధమైన ప్రశ్నలను తాము లేవనెత్తినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
వీటిలో ప్రధానంగా మానవతా సహాయం పెంపు, బంధీలను విడిపించడం కోసం కాల్పుల విరమణ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.
అయితే గాజాలో కాల్పుల విరమణకు అమెరికా చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ ప్రాంతంలోని బందీలందరినీ విడుదల చేసే వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు.
తాము హమాస్‌పై పూర్తి శక్తిని ప్రయోగిస్తున్నామని, తమ బంధీలను విడుదల చేయని తాత్కాలిక కాల్పుల విరమణను ఇజ్రాయెల్ నిరాకరిస్తున్నదని నెతన్యాహు స్పష్టం చేశారు.