Page Loader
Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి
గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి

Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తున్నాయి. గత 24 గంటల్లో 146 మంది పాలస్తీనియులు మృతిచెందారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ విఫలమైన నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచింది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజా దాడుల్లో 459 మంది గాయపడ్డారని గాజాలోని ఆరోగ్య శాఖాధికారులు శనివారం వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇదే అత్యంత తీవ్రమైనదిగా చెబుతున్నారు. మే 5న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, గాజా స్ట్రిప్‌పై పూర్తి అధిపత్యం సాధించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.

Details

హమస్ ను అంతం చేయాలని భావిస్తున్న ఇజ్రాయెల్ 

సహాయ సరఫరాలపై నియంత్రణతోపాటు హమాస్‌పై గట్టిగా దాడులు చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఆ ప్రకారమే ప్రస్తుతం ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఇక గతంలో ఖైదీ-బందీల మార్పిడి ఒప్పందం కింద హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలివిడత మార్పులు జరిగాయి. అయితే దాన్ని కొనసాగించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నప్పటికీ, హమాస్ తిరస్కరించింది. దీంతో హమాస్‌ను నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ మరింత దూకుడుగా దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గాజా పై అధిపత్యాన్ని సాధించాలని చెప్పిన విషయం తెలిసిందే.