Israel : యుద్ధంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు.. నెల పోరాటం తర్వాత, గాజా నడిబొడ్డులో ఐడీఎఫ్ దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌లోని హిజ్బుల్లాకు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ మద్దతు ఉంది.హిజ్బుల్లా యుద్ధంలో చేరాలని అనుకుంటే అది తన జీవిత కాలం పొరపాటు అవుతుందని హెచ్చరించారు.కాల్పుల విరమణ లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో నెల రోజుల పోరాటం తర్వాత ఇజ్రాయెల్ దళాలు గాజా నగరం నడిబొడ్డుకు చేరాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ అన్నారు.
పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లను అణిచివేసేందుకు యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఐడీఎఫ్ దళాలు పోరును ఉద్ధృతం చేశాయి.
అక్టోబర్ 7న హమాస్ దాడుల తర్వాత నెల రోజులుగా భీకరంగా దాడులు చేసింది ఇజ్రాయెల్.
DETAILS
240 మందికి పైగా బందీలను విడిపిస్తే తప్ప గాజాపై సడలింపులు లేవు : నెతన్యాహు
ఈ నేపథ్యంలోనే తమ బలగాలు గాజా నగరం నడిబొడ్డులో విజృంభిస్తున్నాయని గల్లంట్ మంగళవారం తెలిపారు.
ఓ టెలివిజన్ ప్రకటనలో యుద్ధం మొదలై నెల రోజులు గడిచిందని గల్లంట్ గుర్తు చేశారు.హమాస్‌ను పూర్తిగా నిర్మూళన చేయాలనే ఇజ్రాయెల్ సంకల్పాన్ని ఆయన నొక్కి చెప్పారు.
తాము గాజా నగరం నడిబొడ్డున ఉన్నామని, గాేేజా ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద ఉగ్రవాద స్థావరం, పాలస్తీనా మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న 240 మందికి పైగా బందీలను విడిపిస్తే తప్ప గాజాపై సడలింపులు లేవన్నారు.
గత నెల 7న భయంకరమైన దాడితో నెల రోజులు గడుస్తున్న సంఘటనను ఇద్దరు నేతలు గుర్తుచేసుకున్నారు.
హమాస్ దాడిలో మరణించిన 1,400 మందికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులను వెలిగించి స్మరించుకున్నారు.