Page Loader
Israel - Hezbollah: లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. హమాస్‌ కీలక నేత మృతి
లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. హమాస్‌ కీలక నేత మృతి

Israel - Hezbollah: లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. హమాస్‌ కీలక నేత మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2024
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య తాజా దాడుల్లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్‌ అతల్లా మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంలో జరిగింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపిన సమయంలో, అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని హమాస్‌ మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. హమాస్‌ సాయుధ విభాగం అయిన అల్ ఖసమ్‌ బ్రిగేడ్‌కు చెందిన సయీద్‌ అతల్లా, హమాస్‌ మిలిటరీ గ్రూపుల్లో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇజ్రాయెల్‌ మీడియా సైతం ఈ విషయాన్ని వెల్లడించింది. సయీద్‌ మరణంతో హమాస్‌కు పెద్ద దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

Details

2వేల మంది మృతి

ఇజ్రాయెల్‌ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ ఆపరేషన్‌ పలు కీలక మిలిటెంట్‌ నాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల వల్ల లెబనాన్‌లో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా మృతి చెందినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. అందులో 250 మందికి పైగా హెజ్‌బొల్లా సభ్యులు ఉండటం గమనార్హం. హసన్‌ నస్రల్లా మరణంతో ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై 180 క్షిపణులను ప్రయోగించింది. దీనిపై ఇజ్రాయెల్‌ కూడా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌ దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టనున్నట్లు ఇజ్రాయెల్‌ అధికార వర్గాలు ప్రకటించాయి.