Page Loader
గాజాపై ఇజ్రాయెల్ భీకర పోరు.. రాత్రివేళ 100 హమాస్ స్థావరాలను కూల్చివేత
గాజాపై ఇజ్రాయెల్ భీకర పోరు

గాజాపై ఇజ్రాయెల్ భీకర పోరు.. రాత్రివేళ 100 హమాస్ స్థావరాలను కూల్చివేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 20, 2023
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఉగ్రవాదులపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి. ఈ మేరకు గత రాత్రి వైమానిక దాడులు చేసి గాజా స్ట్రిప్‌లో 100 మంది హమాస్ స్థావరాలను ఏరివేసినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. మరోవైపు 203 మందిని హమాస్ బందీలుగా పట్టుకెళ్లడం పట్ల ఇజ్రాయెల్ లో కలకలం రేగుతోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి తర్వాత ఇజ్రాయెల్ లో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఘటనలో వందలాది మరణించగా,వేలాదిగా గాయాలపాలయ్యారు.ఇజ్రాయెల్ బాంబు దాడులతో హోరెత్తిన గాజా విధీలు మొత్తం రక్తసిక్తమయ్యాయి. హమాస్ ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్‌లో దాదాపుగా 1,400 మంది మరణించారు. 4,562 మంది గాయపడ్డారు. హమాస్ పాలనలో ఉన్న గాజాలో 3,785 మంది మరణించగా, 12,493 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

100 హమాస్ స్థావరాలను కూల్చేసిన ఇజ్రాయెల్ దళాలు