Page Loader
Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది పౌరుల మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది పౌరుల మృతి

Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది పౌరుల మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్‌ దళాలు ఉత్తర గాజాపై విరుచుకుపడింది. ఈ ఘటనలో దాదాపు 45 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాలోని బీట్‌ లాహియా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ దళాలు ఆరు భవనాలపై దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మరో ఇంటిపై జరిపిన దాడిలో 10 మంది మరణించగా, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (సీఏఐఆర్‌) స్పందించింది. గాజాపై దాడులను ఆపి సాధారణ పౌరులను కాపాడాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.

Details

ఈ దాడులను ఖండించిన జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

ఈ దాడులపై ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) స్పందిస్తూ, హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా దాడులు చేసినట్లు ధ్రువీకరించింది. జోర్డాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు వ్యతిరేకంగా ఉండి, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు, బీరుట్‌ దక్షిణ శివారులోని రెండు భవనాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ దళాలు లెబనాన్‌ నివాసితులకు సూచించాయి.