Page Loader
Israel Airstrike: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. చిన్నారులతో సహా 40 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. చిన్నారులతో సహా 40 మంది మృతి

Israel Airstrike: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. చిన్నారులతో సహా 40 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా లెబనాన్‌ రాజధాని బీరుట్‌ మీద జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృత్యువాత పడ్డారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని లెబనాన్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. బీరుట్‌తో పాటు తీర నగరంపై కూడా ఇజ్రాయెల్ దాడులను చేసింది. ఇజ్రాయెల్‌ శనివారం దాడులు చేసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నా, సరిగ్గా ఈ దాడుల గురించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని లెబనాన్‌ ఆరోగ్యశాఖ తెలియజేసింది.

Details

ఇజ్రాయెల్ దాడుల్లో 3136 మంది మృతి

గతేడాది కాలంలో ఇజ్రాయెల్‌ దాడుల్లో మొత్తం 3136 మంది ప్రాణాలు కోల్పోగా, 13,000 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్‌ అధికారులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ ప్రస్తుతం పాలస్తీనా హమాస్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. హెజ్బొల్లా గ్రూప్‌ ఇరాన్‌కు మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్‌ ఆగ్రహంతో, లెబనాన్‌పై దాడులను తీవ్రం చేస్తోంది.