Page Loader
IDF-Hamas-West bank: ఐడీఎఫ్ కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ మృతి..మరో ముగ్గురు కూడా..

IDF-Hamas-West bank: ఐడీఎఫ్ కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ మృతి..మరో ముగ్గురు కూడా..

వ్రాసిన వారు Stalin
May 05, 2024
07:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌‌ (Israel) - హమాస్ (Hamas) ల మధ్య కాల్పుల విరమణ చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టెల్ అవీవ్ (Tel aviv) దళాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ హతమయ్యారు. టెల్ అవీవ్ దళాలు జరిపిన కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో తమ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. 2002 నుంచి 2016 మధ్యకాలంలో ఇజ్రాయెల్ జైలులో శ్రేతేహ్ శిక్ష అనుభవించాడు. వెస్ట్ బ్యాంక్ లోని తల్కారేం ప్రాంతంలో తమ దళాలకు,ఉగ్రవాదులకు మధ్య 12 గంటల పాటు కాల్పులు ఎదురు కాల్పులు జరిగాయని ఈ క్రమంలోనే నలుగురు మరణించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.