NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం 
    తదుపరి వార్తా కథనం
    Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం 
    Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం

    Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం 

    వ్రాసిన వారు Stalin
    May 27, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ దళాలు రఫాతో సహా గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతున్నాయి.

    తాజా దాడుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్ పై దాడులు కొనసాగిస్తోంది.

    ఈక్రమంలో హమాస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యాసిన్ రబియా పాలస్తీనా గ్రూపులోని సీనియర్ సభ్యుడు ఖలీద్ నజ్జర్‌లను హతమార్చినట్లు ఆర్మీ తెలిపింది.

    కాగా,ఈ దాడుల్లో మరో 30మంది పాలస్తీనీయులు చనిపోయారు.ఒక వైపు హమాస్‌పై యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా మారణ కాండను జరుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    వచ్చేవారం ఇరుపక్షాలమధ్య చర్చలు తిరిగి ప్రారంభించేందుకు మధ్యవర్తులు యత్నిస్తున్నారు.

    ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్‌,అమెరికన్‌ గూఢచారి సంస్థ సిఐఎ అధిపతి,ఖతార్‌ ప్రధాని జసీమ్ అల్ తానీతో జరిపిన చర్చల్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Details 

    చర్చలపై హమాస్‌ నుంచి స్పందన కరవు 

    ఖతార్‌, ఈజిప్టు, అమెరికా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

    చర్చల పునరుద్ధరణ పై హమాస్‌ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

    అంతర్జాతీయ న్యాయస్థానం గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే ఆపాలని అంతర్జాతీయ నేర విచారణ కోర్టు (ఐసిసి) చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ ఆదేశించారు.

    యుద్ధ నేరాలకు పాల్పడుతున్న నెతన్యాహుకు అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని కోరారు. ఇజ్రాయెల్ కు మద్దతుదారుగా ఉన్న అమెరికాకు ఇది అంతర్జాతీయంగా బిగ్ షాక్ గా భావించాలి.

    ఇంకోవైపు లెబనాన్‌ నుంచి హిజ్బుల్లాలు, యెమెన్‌ నుంచి హౌతీలు ఇజ్రాయెల్, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలపై ప్రతీకార చర్యలకు పూనుకున్నాయి .

    దీంతో ఇది ప్రాంతీయ యుద్ధానికి దారి తీసేలా ఉంది.

    Details 

    ఇజ్రాయిల్‌ దాడుల్లో 35,903 మంది పాలస్తీనీయులు మృతి 

    ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌, అమెరికా చర్చల పునరుద్ధరణకు అయిష్టంగానైనా అంగీకరించకతప్పని పరిస్థితి ఏర్పడింది.

    చర్చలకు ఒక వైపు అంగీకరిస్తూనే మరో వైపు గాజాపై బాంబు దాడులను తీవ్రతరం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

    ఇజ్రాయిల్‌ గత 230 రోజులుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో పిల్లలు, మహిళలతో సహా మొత్తం 35,903 మంది పాలస్తీనీయులు చనిపోయారు.

    మరో 80,420 మంది గాయపడ్డారు. గాజాకు సంఘీభావంగా యెమెన్‌లోను, పశ్చిమ దేశాల్లోను ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    అమెరికా
    ఖతార్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఇజ్రాయెల్

    US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట  ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు  హమాస్
    Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు  హమాస్
    Israel-Hamas War : గాజాలో వేల సంఖ్యలో మరణాలు.. 'డంబ్ బాంబ్సే' కారణమా? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    అమెరికా

    private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం  వర్జీనియా
    US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి  తెలంగాణ
    Terrorism: అమెరికా నేల నుండే భారతదేశంపై తీవ్రవాద కార్యకలాపాలు.. ఎఫ్‌బీఐకి కీలక సమాచారం  అంతర్జాతీయం
    Donald trump: నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్  డొనాల్డ్ ట్రంప్

    ఖతార్

    8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు  అంతర్జాతీయం
    Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్ భారతదేశం
    Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి హమాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025