Donald Trump: కరోలిన్ లీవిట్ స్థానంలో మరొకరు దొరకడం కష్టమే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
వైట్‌హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఆమె స్థానంలో మరొకరిని నియమించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇటీవల కేటీ జకారియాను ఆ బాధ్యతల్లో నియమించినప్పటికీ.. ఆమె పనితీరుపై విమర్శలు, విద్యార్హతలపై ప్రశ్నలు తలెత్తడంతో బాధ్యతలు చేపట్టిన ఐదు రోజులకే తొలగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోలిన్ లీవిట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కంటే ఆమెకు తన బిడ్డే ఎక్కువ ఇష్టమని చమత్కరించారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి విధుల్లోకి రావడానికి ఆమె అంగీకరించలేదని పేర్కొన్నారు.
వివరాలు
'ఆమె స్థానంలో మరొకరిని వెతకడం కష్టంగా మారింది'
కరోలిన్ లీవిట్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు. వైట్‌హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీగా ఆమె హుందాగా, అద్భుతంగా పనిచేశారని అన్నారు.
ఇప్పుడు ఆమె స్థానంలో అలాంటి మరొకరిని నియమించడం కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను కరోలిన్‌తో కూడా ప్రస్తావించినట్లు ట్రంప్ తెలిపారు.
అయితే ఆమె తన కంటే బిడ్డనే ఎక్కువగా ప్రేమిస్తోందని చమత్కరించారు. అది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.
త్వరలోనే పెద్ద స్టార్ అవుతుంది: ట్రంప్
ప్రస్తుతం కరోలిన్ లీవిట్ ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. త్వరలోనే ఆమె పెద్ద స్టార్‌గా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్‌లో ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ప్రశంసలు కురిపించారు.