Italy : ఈ జంట మృత్యుంజయులు.. ఒకే రోజు, ఇద్దరికీ వేర్వేరు విమాన ప్రమాదాలు
ఈ వార్తాకథనం ఏంటి
భూమి మీద బతకాలని నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బయటపడొచ్చు అంటుంటారు. అయితే ఓ జంట విషయంలో నిజంగా అదే అద్భుతం జరిగింది.
ఒకే రోజు వేర్వేరు విమానాలెక్కిన జంట, ప్రమాదం నుంచి గట్టెక్కింది. స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు సరదాగా బయలుదేరిన ఓ జంట విమాన ప్రమాదానికి గురైంది.
వేర్వేరు విమానాల్లో ప్రయాణించిన ఈ ఇద్దరు ప్రాణాలతో బయటపడటం గ్రేట్'గా అనిపిస్తోంది. టురిన్‌లో ఫ్రెండ్స్‌తో లంచ్ డేట్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
స్టెఫానో పిరిల్లి (30), కాబోయే భార్య ఆంటోనియెట్టా డెమాసి (22) ఉత్తర ఇటలీ నగరమైన టురిన్‌లో స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు వేర్వేరు తేలికపాటి విమానాల్లో బయలుదేరారు.
details
భారీ ప్రమాదమే జరిగదినా ఇద్దరూ బతికి బట్టకట్టగలిగారు
తిరిగి వస్తుండగా స్టెఫానో ప్రయాణిస్తున్న రెండు సీట్ల టెక్నామ్ P92 ఎకో సూపర్‌లో ఇబ్బందులు ఎదురై శాన్ గిల్లియో వద్ద కూలిపోయింది.
ఇక ఆంటోనీయెట్టా ప్రయాణిస్తున్న విమానం బుసాన్ వద్ద 25 మైళ్ల దూరంలో కూలిపోయింది.రెండు విభిన్న ప్రదేశాల్లో జరిగిన విమాన ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులు,పైలట్‌లను ఆస్పత్రికి తరలించారు.
ఘటనలో స్టెఫానో గాయాల నుంచి తప్పించుకున్నాడు.ఇక ఆంటోనీయెట్టా డెమాసితో ప్రయాణిస్తున్న పైలట్ గాయపడ్డారు.
ఉష్ణోగ్రతలు పతనం,పొగమంచు రావడంతో ప్రమాదాలు సంభవించినట్లు తెలుస్తోంది.ఈ రెండు ప్రమాదాలపై పౌర విమానయాన అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
స్టెఫానో, ఆంటోనీయెట్టా జంట వేర్వేరు విమానాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఇవి రెండూ ఒకేసారి ప్రమాదానికి గురి కావడం, పైగా ఇద్దరూ ప్రాణాపాయ స్థితిని దాటి బతికి బయటపడటం ఆసక్తికరంగా మారింది.