LOADING...
Jaishankar-Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ.. 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ..

Jaishankar-Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను కలిసారు. మంగళవారం బీజింగ్‌లో ఈ భేటీ నిర్వహించారు. ఈ విషయాన్ని స్వయంగా జైశంకర్‌ ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) వేదికగా వెల్లడించారు. 2020లో గల్వాన్ లోయ ఘటన కారణంగా భారత్-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి చైనా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. టియాంజిన్‌ నగరంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. బీజింగ్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం మంత్రి టియాంజిన్‌ వైపు పయనించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ..