LOADING...
Japan PM: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా
జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా

Japan PM: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు తీసుకున్న ఒక చర్యగా తెలుస్తోంది. ముఖ్యంగా జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (LDP) పరాజయం తర్వాత, సొంత పార్టీలోని నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇషిబా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఫుమియో కిషిద రాజీనామా చేసిన తర్వాత, లీడర్షిప్ ఎన్నికల్లో విజయం సాధించిన షిగెరు ఇషిబా అక్టోబర్‌ నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ జులైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌ ఎగువ సభలో పార్టీ మెజార్టీని నిలిపుకోలేకపోయింది.

Details

వర్చువల్‌ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం

అలాగే, దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోవడంతో, స్వపక్ష సభ్యుల ఒత్తిడి ప్రధానిపై పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో, పార్టీ నాయకత్వ మార్పు కోసం ముందస్తు ఎన్నికలు చేయాలా లేదా అనే అంశంపై చర్చించేందుకు, లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సెప్టెంబర్ 8న నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ఆ నిర్ణయం ఆమోదం పొందినప్పుడు, ప్రధానిపై వర్చువల్‌ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఇషిబా రాజీనామా ప్రకటించారు. పార్టీకి ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.