JD Vance: జేడీ వాన్స్‌కు నిరసన సెగ.. ఉక్రెయిన్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించిన అమెరికన్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్‌లో ఖనిజాల వెలికితీత, అలాగే రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు సంబంధించి శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇద్దరు నేతలు మీడియా మరియు పలువురు దౌత్యవేత్తల సమక్షంలో రష్యా యుద్ధంపై వాదనకు దిగారు.
జెలెన్‌స్కీ తీసుకుంటున్న వైఖరిపై ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సంఘటన అనంతరం,అమెరికా వ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి.
వివరాలు
వెర్మోంట్ స్థానికులు ఉక్రెయిన్ మద్దతుదారులుగా..
న్యూయార్క్,లాస్ ఏంజెల్స్, బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి, "అమెరికా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తోంది","బలంగా నిలబడండి ఉక్రెయిన్" అనే ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో,అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరసన సెగను ఎదుర్కొన్నారు.
ఆయన తన కుటుంబంతో కలిసి స్కీ హాలిడే (Ski Holiday)కోసం వెర్మోంట్ (Vermont)వెళ్లినప్పుడు, అక్కడి స్థానికులు ఉక్రెయిన్ మద్దతుదారులుగా ఆయనను నిరసనలతో ఆహ్వానించారు.
వెర్మోంట్‌లోని వెయిట్స్‌ఫీల్డ్‌లో వందలాది మంది ప్రజలు ఒక్కచోట చేరి,"వెర్మోంట్ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంది"వంటి ప్లకార్డులతో పాటు ఉక్రెయిన్ జెండాలను ప్రదర్శించారు.
ఈ నిరసనల ప్రభావంతో వాన్స్ కుటుంబం స్కీ రిసార్ట్ నుంచి వేరే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిరసన వీడియో
Vermont's message to JD Vance: Not in our town, you fascist piece of shit. 😡😡😡😡😡👇 pic.twitter.com/Pk4QwFu3fv
— Bill Madden (@maddenifico) March 1, 2025